కొండయ్య మృతి పట్ల బిజెపి రాష్ట్రం కార్యవర్గ సభ్యులు వీరన్న చౌదరి సంతాపం
పెన్ పవర్, సీతానగరం
పెన్ పవర్, సీతానగరం
జాలిమూడి మాజీ సర్పంచ్ కడుగుల కొండయ్య మృతిపట్ల బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నీరు కొండ వీరన్న చౌదరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరన్న చౌదరి తెలియజేస్తూ ఐ ఎఫ్ ఎస్ నందు విశేష సేవలు అందించారని విలువైన నాయకుడిని మండలం కోల్పోయిందనీ ఉన్నత రాజకీయ విలువలతో ప్రతిభను ఘనంగా చాటిన సీనియర్ నాయకుడు కొండయ్య మరణం విచారకరమన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జీవితం గడిపిన నేత అని ప్రజాసేవలో జీవితాంతము గడిపిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన మరణం మండల ప్రజలకు తీరని లోటు అన్నారు. కొండయ్య మరణవార్త తీరని దుఃఖంన్ని మిగిల్చిందని తెలిపారు.ఆ ఆదర్శ వాది ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ ఆ కుటుంబ సభ్యులకు వీరన్న చౌదరి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పలువురు పార్టీలకతీతంగా కొండయ్య మరణంపై నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
No comments:
Post a Comment