గోకవరం లో జగనన్న పచ్చ తోరణం.
గోకవరం పెన్ పవర్.
గోకవరం మండలం లో బుధవారం జగనన్న పచ్చ తోరణం కార్యక్రమాన్ని స్థానిక ఎంపిడిఓ, తాసిల్దార్ ప్రారంభించారు. మండలంలోని గోకవరం, వెదురుపాక గ్రామాల్లో ఏర్పాటు చేసిన నవరత్నాలు-పేదలందరికీ ఇల్లు పథకం లో భాగంగా ఎనర్జీ ఎస్ లో అభివృద్ధి చేసిన వెదురపాక ,గోకవరం, కామరాజుపేట, అచ్యుతాపురం లే అవుట్ లో స్థానిక ప్రజా ప్రతినిధులు మండల తాసిల్దార్ కె.పోసిబాబు, ఎంపీడీవో కె కిషోర్ కుమార్ నాటి పచ్చ తోరణం కార్యక్రమం ప్రారంభించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ పచ్చ తోరణం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది.
No comments:
Post a Comment