ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
- పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
చింతూరు, పెన్ పవర్
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకట రమణ, చింతూరు అటవీశాఖ డివిజన్ డియఫ్ఓ వి సాయిబాబాలు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది నిర్వహిస్తున్న వన మహోత్సవంలో బుధవారం 71 వన మహోత్సవం (జగనన్న పచ్చ తోరణం) కార్యక్రమంలో భాగంగా చింతూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతి ఏడాది 10 మొక్కలు నాటి వాటి పరిరక్షణకు పాటు పడాలని పిలుపునిచ్చారు. నేటి మొక్కలు రేపటి మానవాళి మనుగడకు ఎంతో దోహద పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో లాగింగ్ డివిజన్ డియఫ్ఓ కొండల రావు, చింతూరు రేంజర్ కమృద్ధిన్, అటవీశాఖ అధికారులు చిన్న భిక్షం, వీర భద్రయ్య, సరిత, రాములమ్మ, ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మీ హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment