ఫేస్ ప్రొటెక్షన్ మాస్క్ లను పంపిణీ
పెన్ పవర్, ఉలవపాడు
సింగరాయకొండ మండలంలోని శానంపూడి గ్రామానికి చెందిన కాట్రగడ్డ వేణు ఆర్ధిక సహకారంతో ఫేస్ ప్రొటెక్షన్ మాస్కులను
ప్రకాశం జిల్లా న్యాయసేవాధికార సంస్థ పిలుపుమేరకు పారాలీగల్ వాలంటీర్,ఫ్రెండ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పంతగాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నిత్యం ప్రజల ఆరోగ్య రక్షణ భద్రత కోసం అహర్నిశలు పనిచేస్తున్న వైద్య సిబ్బందికి పేస్ ప్రొటెక్షన్ మాస్క్ లను డాక్టర్ బ్రహ్మయ్య చేతుల మీదగా పంపిణీ చేశారు.వైద్య అధికారులు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యక్షంగా శరీరం లోనికి వ్యాధులు ప్రవేశించి టానికి అవకాశమున్న భాగాలలో ప్రధానంగా ముక్కు, కళ్ళు,నోరు అని,ఒకవేళ ముక్కుకి,నోటికి మాస్కులు ధరించి నప్పటికీ కరోనా వైరస్ ఎదుటివారు మాట్లాడినప్పుడు వారి నోటిద్వారా వచ్చే తుంపర్ల నుండి కంటి ద్వారా శరీరంలోనికి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదని,కనుక తప్పనిసరి పరిస్థితులలో ఎక్కువ మంది ప్రజలతో ఉండవలసి వచ్చినప్పుడు ముఖాన్ని అంతటికీ రక్షణగా ఫేస్ ప్రొటెక్షన్ మాస్కులు ఉపయోగపడతాయని తెలిపారు.గుంపులు గుంపులుగా ఉన్న సమయంలో ఈ మాస్క్ లు ఎదుటి వారు మాట్లాడేటప్పుడు తుంపర్లు పడకుండా ఉపయోగపడతాయని అన్నారు.ప్రజలు తమకు తాము జాగ్రత్తలు పాటించడం, సామాజిక బాధ్యత అన్నారు. అదేవిధంగా కనుమల్ల గ్రామ మలినేని కాలేజీ లోని కొరంటైన్ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి కూడా పంపిణీ చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కోటేశ్వరరావు,సునీల్ గవాస్కర్,కీర్తి శ్రీ,ఆరిబోయిన రాంబాబు మరియు ఆశా వర్కర్లు,సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment