న్యాయం కోసం సమైక్యంగా పోరాటం చేస్తాం--
తెదేపా నియోజకవర్గ ఇంచార్జ్ వరుపుల రాజా.
ఏలేశ్వరం,పెన్ పవర్
న్యాయం కోసం సమైక్యంగా ఉండి పోరాటం చేస్తామని ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వరుపుల రాజా అన్నారు .ఇటీవల ఆదివారం అర్ధరాత్రి న్యాయవాది పైలా సుభాష్ చంద్రబోస్ ను ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి పోలీసులు అరెస్టు చేసి తీసుకు వెళ్లడం అన్యాయమన్నారు. ఏలేశ్వరంలో పైలా సుభాష్ చంద్రబోస్ గృహమునందు వారి కుటుంబ సభ్యులను కలసి విలేకరుల సమావేశం మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సర కాలంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులను పలు ఇబ్బందులకు గురి చేస్తూ తప్పుడు కేసులతో ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారు అంటూ ఆరోపించారు. గతంలో కత్తిపూడి లో శివ , బీసీ నాయకుడు ఎక్స్ సర్పంచ్ నరసయ్య, జనసేన కర్లపూడి వేపూరి శీను తదితరులపై కక్షపూరితంగా నే వ్యవహరించి అక్రమ కేసులు బనాయించారు అన్నారు. బోస్ అక్రమ అరెస్టుపై హైకోర్టు సీరియస్ అయిన సంగతి అందరికీ విదితమే ఇటువంటి దుశ్చర్యలను ఆపకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన అన్నారు .ఈ అక్రమాలపై పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు జ్యోతుల నెహ్రూ తనను అడిగి తెలుసుకున్నారని తేదేపా పార్టీ శ్రేణులకు ఎటువంటి ఆపద వచ్చినా న్యాయ పూర్వకంగా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాలుగు మండలాల పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment