అభివృద్ధి పనులను సమీక్షించిన అధికారులు
పెన్ పవర్, ఆత్రేయపురం
మండలం లో వివిధ ఇంజనీరింగ్ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశపు మందిరంలో ఎంపీడీఓ నాతి బుజ్జి సంబంధిత శాఖల అధికారులతో కలిసి గ్రామ సచివాలయ సిబ్బందితో సమీక్షించారు. పేదలందరికీ ఇళ్లు పధకం లో గుర్తించిన లబ్ధిదారులకు హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వీసు కోడ్ జనరేట్ వేయాలని కొత్తపేట హౌసింగ్ డిఈ శ్రీనివాస్ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ లకు తెలిపారు. అలాగే ఆత్రేయపురం మండలంలో మంజూరు అయిన వ్యక్తిగత మరుగుదొడ్లకి సంబంధించి అర్హులైన వారి పేమెంట్ కొరకు ఆన్లైన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆర్ డబ్ల్యు ఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ అసిస్టెంట్ లకు సూచించారు. మండలం లో జరుగుతున్న సచివాలయ భవనాల నిర్మాణం, నాడు నేడు పనులు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం, వెల్ నెస్ నిర్మాణంలో అంచనాల కనుగుణంగా నాణ్యతతో పనులు చేయాలని మండల ఇంజనీరింగ్ అధికారి వీరభద్రరావు తెలిపారు. ఈ సమావేశంలో హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు, డిజిటల్ అసిస్టెంట్ లు, హౌసింగ్ కంప్యూటర్ ఆపరేటర్ లు పాల్గొన్నారు
No comments:
Post a Comment