Followers

శివుని పాత్ర లో చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ





గాజువాకలో మళ్లీ మొదలైన జైమోదకొండమ్మ  చిత్రం.
   శివుని పాత్ర లో చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ.
  తాంత్రిక శక్తులు  దైవం మధ్య పోరాటమే చిత్రం.
     

విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)


మన్యం  ఇలవేల్పు గిరిజనుల ఆరాధ్య దైవం జై. మోదకొండమ్మ  చిత్రం షూటింగ్  విశాఖ నగరంలో  మళ్ళీ మొదలైంది. మంగళవారం శ్రావణమాసం శుభ సందర్భంగా  గాజువాకలో షూటింగ్ ప్రారంభించారు.   పరమశివుని తపోభంగం చేయటానికి వచ్చిన మాంత్రికుని మధ్య జరిగిన సన్నివేశాన్ని చిత్రీకరించారు. మన్యంలో కొలువైన  కోర్కెలు తీర్చే కల్పవల్లి  ఇతివృత్తం గా  పోలాకి శివ దర్శకత్వంలో జై  మోదకొండమ్మ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ముహూర్తపు షాట్ మాడుగుల మోదకొండమ్మ ఆలయంలో నిర్వహించారు. అనంతరం పాడేరు అరకు  మాదపల్లి  ప్రాంతాల్లో అమ్మవారి కథ సారాంశం పై  సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. తూర్పుగోదావరి పరిసరాల్లో కొన్ని షాట్లు  తీశారు. ఇంతలో కరోనా మహమ్మారి వ్యాపించడం లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ మూత పడిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సడలింపు  తర్వాత ప్రభుత్వ అనుమతితో నిబంధనల మేరకు  సినిమా షూటింగులు మొదలయ్యాయి. జై మోద కొండమ్మ  చిత్రం మిగిలిన సన్నివేశాలను చిత్రీకరణ మళ్ళీ  ప్రారంభమైంది. జై మోదకొండమ్మ చిత్రంలో  శివుని పాత్ర చోడవరం  శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ పోషిస్తున్నారు. తన స్వగృహంలో తపస్సులో  ఉన్న శివునిపై   తపో భంగానికి  వచ్చిన మాంత్రికుడు  పై  ఎదురుదాడి  సన్నివేశం చిత్రీకరించారు. విశాఖ నగరంలో పలు ప్రాంతాల్లో చిత్ర షూటింగ్ జరుగుతున్నట్లు యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి డైలాగ్   శ్రీనివాస్ లవ్ చైతన్య విభూది. ప్రొడ్యూసర్స్ చైతన్య లక్ష్మి పి ఎస్ ప్రసాద్ కో ప్రొడ్యూసర్  కడలి నిర్మల గోవిందా వ్యవహరిస్తున్నారు.

*కరణం కు  నటన అంటే ఎంతో ప్రీతి*
చోడవరం వైయస్సార్సీపి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి  నటించడం అంటే ఎంతో ప్రీతి. రాజకీయాలకు ముందు నుంచి తన స్వగ్రామమైన కేజే పురం లో నాటకాల్లో పలు పాత్రలు వేసి ప్రజల మన్ననలు పొందారు.  2004లో తాను మొదటిసారి మాడుగుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాజధానిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో  ఆయన అన్నమయ్య పాత్రలో లీనమై అయిపోయి సీఎం మన్ననలు పొందారు. ఆ తరువాత ఎప్పుడు కలిసినా రా అన్నమయ్య అని వై ఎస్ సంబోదించేవారు. 2005లో పెద్దేరు జలాశయం ప్రారంభోత్సవానికి వచ్చిన వైయస్ ఎలా ఉన్నావ్ అన్నయ్య అని పలకరించిన తీరు శ్రీ నటన ఎంత ఆకట్టుకుందో మరి. ఆ తరువాత గిరిజనుల దురాచార సంస్కృతి నేపథ్యంలో వచ్చిన దుర్గి చిత్రంలో కొండవలస శ్యామల తో కలిసి నటించారు. జైమోదకొండమ్మ  చిత్రంలో మళ్లీ నటిస్తున్నారు. అతనితో అనుబంధం ఉన్న వారు  చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.
 

 


 




No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...