వెబ్ లాండ్ లేదా కౌలు కార్డు కలిగిన వారికే ఈ పంట నమోదు.
వ్యవసాయ అధికారి కే గంగాధర్
పోలవరం పెన్ పవర్
వెబ్ ల్యాండ్ లేదా కౌలు రైతు కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ పంట నమోదు అర్హత కలిగి ఉంటుందని పోలవరం వ్యవసాయ అధికారి కే గంగాధర్ అన్నారు సోమవారం పోలవరం మండలం స్థానిక ఎంపీడీవో కార్యాలయం మీటింగ్ హాల్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బందికి, వ్యవసాయ శాఖ సిబ్బందికి ఈ పంట నమోదు పై అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వ్యవసాయ అధికారి కే గంగాధర్ మాట్లాడుతూ జులై నెల 12 వ తారీకు నుంచి ఆగస్టు 15 తారీకు వరకు ఈ పంట నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. నమోదు కొరకు రైతు యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, పంట వివరాలను తెలియ పరచాలి అని అన్నారు. అనంతరం రైతు పొందిన ఐ డి ఆధారంగా రిజిస్ట్రేషన్ పూర్తిచేసి పంట వివరాలను నమోదు చేసి బీమా ప్రక్రియను పూర్తి చేయడం జరుపుతున్నారు. వెబ్ ల్యాండ్ లేదా కౌలు కార్డు ఉన్న వారికే ఈ పంట నమోదుకు అర్హులన్నారు. రైతులు తప్పనిసరిగా పంటను ఫోటో తీసి అందజేయాలని అన్నారు. వారు ఇచ్చిన వివరాలను, పంట ఫోటో పరిశీలించిన అనంతరం వీఆర్వో , వి ఏ ఏ , వి హెచ్ ఏ లు బయోమెట్రిక్ నిర్వహించి ఆధరైజ్ చేస్తారన్నారు. ఒక్కసారి డేటా నమోదు చేశాక మార్పులు, చేర్పులు చేయడం కుదరదన్నారు. రైతు పంట నష్టం, బీమా సౌకర్యం, పంటను గిట్టుబాటు ధరకు అమ్మడం తదితర సౌకర్యాలు పొందాలంటే ఈ పంట నమోదు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మండలంలోని రైతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలవరం తహసిల్దార్ ఎండి నజీముల్లా షా , వ్యవసాయ అధికారి కె గంగాధర్, ఏ ఎస్ ఓ, వీఆర్వో, వి ఏ ఏ, వి హెచ్ ఏ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment