అక్రమంగా మద్యం తరిలిస్తున్న ఓ వ్యక్తి
మండపేట,పెన్ పవర్
మండపేట మండలం ఇప్పనపాడులో అక్రమంగా మద్యం తరిలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని నుండి 96 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు మండపేట రూరల్ ఎస్ఐ పి.దొరరాజు తెలిపారు. పసలపూడి గ్రామానికి చెందిన సైనవరపు శ్రీను అనే యువకుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం బాటిళ్లను మోటార్ సైకిల్ పై తరలిస్తుండగా ముందస్తుగా అందిన సమాచారం మేరకు కాపు కాసి పట్టుకున్నట్లు చెప్పారు. నిందితుడి వద్ద ఎటువంటి అనుమతులు లేకపోవడంతో అక్రమ మద్యం తరలింపుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.96 డెక్కన్ బ్లూ విస్కీ క్వర్టర్ బోటిళ్లతో పాటు బైక్ ను సైతం సీజ్ చేసినట్లు ఎస్.ఐ తెలిపారు.
No comments:
Post a Comment