నేటి నుంచి ఆటోలు బంద్.
ఆటో యూనియన్ అధ్యక్షు,కార్యదర్శులు
చింతపల్లి , పెన్ పవర్
విశాఖ మన్యంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాలలో ఆటో సర్వీసులను రద్దు చేయాలని ఆటో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్వి రమణ, నీలకంఠం లు బుధవారం తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో ఉన్న ఆటో సర్వీసుల వలన కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఆటోలలోమైదాన ప్రాంత వ్యాపారస్తులు ప్రయాణిస్తున్నారని వీరి ద్వారా తొందరగా కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. ఆటో యూనియన్ సభ్యులందరూ యూనియన్ నిబంధనలను పాటించి నేటి నుంచి పది రోజుల పాటు ఆటోలను నడప రాదని సూచించారు. యూనియన్ నిబంధనలను అతిక్రమించి ఆటో సర్వీసులు చేస్తే వారిపై యూనియన్ పరంగా చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment