దాతల సహకారం..
చిన్నారి వైద్యానికి ఆర్థిక సాయం..
మండపేట,పెన్ పవర్
మండపేట: గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి దాతలు ముందుకు వచ్చి ఆర్ధిక సహకారం అందించారు. మండలం లోని ఏడిద గ్రామానికి చెందిన వైకాపా నేత పలివెల సుధాకర్ చిన్నారిని ఆదుకోవాలని తలచారు. గుండె వ్యాధితో బాధపడుతున్న చిన్నారి బాధను నలుగురికీ తెలియ జేశారు. దీంతో పలువురు మనసున్న మారాజులు ముందుకు వచ్చారు. సేకరించిన నిధులు మొత్తం 45000 బాధిత కుటుంబానికి అందజేసి వారి ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే మండలం లోని ఏడిద కు చెందిన లంక రాణా అనే ఐదు నెలల పాప గుండె కు చిల్లు పడడంతో శస్త్రచికిత్స అవసరమైంది. ఆరోగ్యశ్రీ పథకం కింద విజయవాడలో శస్త్ర చికిత్స చేసేందుకు ఇప్పటికే ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చర్యలు తీసుకున్నారు. త్వరలో శస్త్రచికిత్స చేస్తామని ఆసుపత్రి వర్గాలు తెలిపినట్లు తండ్రి రాణా తెలిపారు. కాగా ముందుగా వైద్య పరీక్షలు, ఇతర వసతుల కోసం రూ 50,000 వరకు ఖర్చు అవుతుండడంతో నిరుపేదలైన రాణ కు దాతలు సాయం అందించారు. వైకాపా నేత పలివెల సుధాకర్ ఆధ్వర్యంలో సోమవారం సి ఐ యు టీవీ ఛానల్ వారు రూ 25,000, గ్రామంలోని బాబు జగ్జీవన్ రామ్ యూత్, ఉద్యోగులు రూ 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. పాప త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సిద్ధాంతపు అహరోను, ఉండ్రాజవరపు చిన్నా, చాపల సతీష్, పైడిమళ్ల సుబ్బారావు, ఖండవల్లి సైమాన్, పైడిమళ్ల రాజు,సృజన్, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment