మా మోర ఆలకించండి సారూ..
అంబులెన్స్ అందుబాటులో లేక గిరిజనుల అవస్థలు.
చింతపల్లిలో ఉంటున్న గూడెం 108వాహనం.
గూడెం కోత్త వీధి, పెన్ పవర్
పేదలకు వైద్య సేవలు చేరువ చేయాలని ప్రభుత్వం ప్రతీ మండలంలో ఒక 108 అంబులెన్స్ ని ఏర్పాటు చేసింది. ఈనేపద్యంలో గూడెం కొత్తవీధి మండలానికి కేటాయించిన 108 అంబులెన్స్ వాహనం మాత్రం చింతపల్లి మండల కేంద్రం లో ఉంటుంది. అందువల్ల గూడెం కొత్తవీధి మండలం గిరిజనులు నానా అవస్థ లకుగురవుతున్నారు. మండలంలో శివారు గ్రామాలకు రహదారి సౌకర్యం లేక గిరిజనులు రాకపోకలకు వీలు లేకుండా పోయింది. గిరి పుత్రులు అనారోగ్యం కు గురైతే ఆసుపత్రి కి తరలించడం ప్రాణ సంకటంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనం కోసం కాల్ చేస్తే గంటల తరువాత పక్క మండలం నుంచి వస్తుందని గిరిజనులు బాహాటంగా ఆరోపిస్తున్నారు. అంబులెన్స్ వెళ్లలేని ప్రాంతాల నుంచి రోగిని బైక్ అంబులెన్స్ ద్వారా తీసుకుని రోడ్డు సౌకర్యమున్న చోటికి చేర్చలి. మండలంలో అలా జరగటం లేదని గిరిజనులు వాపోతున్నారు ప్రమాదం సంభవించినా తరువాత ప్రాణం కోల్పోయిన స్థితిలో ఉన్న రోగులు ఫోన్ చేసినప్పటికీ కనీసం 108. కి పోన్ చెస్తే కాల్ కట్ చేస్తున్నారని . అత్యవసర పరిస్థితుల్లో ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నాందున అటువంటి సమయంలో కూడా సకాలంలో ఆసుపత్రికి తరలించేందుకు రావాల్సిన 108 అంబులెన్స్ కు సంబందిచి ఫోన్ చేస్తే కాల్ సెంటర్ నుండి గాని దానికి సంబంధించిన అధికారుల నుంచి గాని సరైన స్పందన లేదని మండల ప్రజలు, రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా నాయకులు, అధికారులు చొరవతీసుకుని స్పందించాలని వేడుకుంటున్నారు .
No comments:
Post a Comment