జనసైనికుల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ.
పరవాడ, పెన్ పవర్
పరవాడ: మండలం తానం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పరదేశిమాంబ గుడి వద్ద మొక్కలు నాటే కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు ఐదు కేజీల బియ్యం ,9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పెందుర్తి నియోజకవర్గం సీనియర్ నాయకులు మోటూరు సన్యాసినాయుడు , చుక్కా నాగు, మోటూరు హరి, స్థానిక జనసైనికులు శ్రీను (గబ్బర్), ఆచారి, కృష్ణ, పవన్ తదితర జన సైనికులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment