వైద్య ఆరోగ్య ఉద్యోగులకు కనీస వసతులు కల్పించాలి
వైయస్సార్ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మూర్తి విజ్ఞప్తి
జగ్గంపేట, పెన్ పవర్
కోవిడ్ 19 నివారణ కోసం ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తుందని రాష్ట్ర వైయస్సార్ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం కన్వీనర్ ఎన్ ఎస్ ఆర్. మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ లు, ఇతర సిబ్బంది నియామకం హర్షణీయమన్నారు. ప్రత్యేక కార్యదర్శి మొదలుకొని ఏ డబ్లు హెచ్. స్థాయి ఉద్యోగుల వరకు అవిశ్రాంతం రోగులతో పోరాటం చేయటం ప్రశంసనీయం అన్నారు. దీనికితోడు ప్రజా సహకారం ఎంతో అవసరం వ్యక్తిగత దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి గా పాటించాలని కోరారు. విధి నిర్వహణలో కొంతమంది వైద్యులు, నర్సులు ఇతర ఆరోగ్య సిబ్బంది వ్యాధి బారిన పడటం కొంతమంది మరణించడం చాలా విచారకరం అన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి వారి కుటుంబాలకు ప్రత్యేక కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేయాలి, కోవిడ్ బారినపడ్డ ఉద్యోగుల క్వారంటైన్ చికిత్స సమయం న్యూ టి ఫిరియన్ గా పరిగణించాలి. సిబ్బందికి అత్యవసర చికిత్స అవసరమైనప్పుడు ఆసుపత్రు లలో ప్రత్యేక వసతి ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ .ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ని కోరినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జోన్ అధ్యక్ష కార్యదర్శి వై.శ్రీనివాసరావు, కె. వీరబాబు, ఉద్యోగ సంఘం నాయకులు రామరాజు, గంగాధరం తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment