రైతు భరోసా కేంద్రాల సేవలను వినియోగించుకోండి.
రైతు భరోసా కేంద్రాలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు రైతులను కోరారు
పెన్ పవర్, ఉంగుటూరు
ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం కురెళ్ళగూడెం లోని రైతు భరోసా కేంద్రం వద్ద బుధవారం నిర్వహించిన రైతు దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. రైతు భరోసా కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు కోరారు. రైతు దినోత్సవం పురస్కరించుకొని గ్రామస్థాయిలో ఎకరాకు 60 ధాన్యం బస్తాల దిగుబడి సాధించిన రైతును ,ఎకరాకు 6 టన్నుల ఆక్వా దిగుబడి సాధించిన ఆక్వా రైతును, కౌలు రైతులను పశుపోషణ ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించిన ఆక్వా రైతులను కలెక్టర్ గారు , శాసనసభ్యులు వారు సన్మానించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల వాసు బాబు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడిగా తన అందించిన సేవలు ద్వారా గుర్తింపు పొందారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతకు మించిన స్థాయిలో రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడం ద్వారా గుర్తింపు పొందటం అభినందనీయమన్నారు. రైతులకు వడ్డీ రాయితీ గా కేటాయించిన మొత్తాలను ముఖ్యమంత్రి రైతుల ఖాతాలోకి నేరుగా జమ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు, ఉంగుటూరు శాసనసభ్యులుపుప్పాలవాసుబాబు, వ్యవసాయ శాఖ అధికారులు, ఉంగుటూరు వైయస్సార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment