కరోనా కంటోన్మెంట్ జోన్ ను పరిశీలించిన అధికారులు
త్రిపురాంతకం, పెన్ పవర్
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల పరిధిలోనిరామాలయం వీధిలో రెండు కరోనా కేసులు నమోదు కావటంతో మంగళవారం ఆ ప్రాంతాల్లో 200 మీటర్ల మేర ఎవరు బయటకు వెళ్లకుండా బయట వారు ఆ ప్రాంతానికి రాకుండా కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేసి బ్లీచింగ్ తో ఆ ప్రాంతాన్ని శానిటేషన్ చేశారు.కోవిడ్ 19 నియోజకవర్గ ఇంచార్జ్ వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో వైద్య అధికారులు డా. నాగేశ్వరరావు నాయక్,ఎంపీడీఓ సుదర్శనం,ఈఓపిర్ది వెంకటేశ్వరవు రెవిన్యూ , ఎం.ఆర్.ఓ. వి. కిరణ్ కుమార్ ,ఎస్ ఐ యు వి కృషయ్య తదితరులు పరిశీలించారు.ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటిస్తూ అక్కడ నివసించే వారు బయట తిరగరాదని వారికి కావలసిన నిత్యావసర మొదలగునవి ఏర్పాటు చేస్తామన్నారు.ప్రతి ఒక్కరు సమన్వయం తో భౌతిక దూరం పాటించి,ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎమ్ లు, ఆశావర్కర్లు, సచివాలయ సిబ్బంది, వలేంటిరీలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment