Followers

తిరుగుడు మెట్ట రెడ్ జోన్లో ఫీవర్ క్లినిక్


తిరుగుడు మెట్ట రెడ్ జోన్లో ఫీవర్ క్లినిక్



తాళ్ళపూడి,  పెన్ పవర్


తాళ్ళపూడి మండలం తిరుగుడు మెట్ట గ్రామంలో  రెడ్ జోన్లో ఫీవర్ క్లినిక్ ఏర్పాటు చేశామని డాక్టర్ సుష్మా చౌదరి తెలిపారు. ఆశా వర్కర్స్, ఎ.ఎన్.ఎం. లు ఇంటింటికి వెళ్ళి కరోన లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, కరోన టెస్ట్ చేయించుతున్నామని తెలిపారు. ఇతర అనారోగ్య పరిస్థితులు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి, మందులు ఇస్తున్నామని తెలిపారు. తాళ్ళపూడి మండలం కరోనాకు సంబంధించిన స్పెషల్ అధికారి ఈ.ఒ.(పి.ఆర్. అండ్ ఆర్.డి) జి.వి.వెంకన్న సోమవారం తిరుగుడు మెట్ట గ్రామంలో ఉన్న రెడ్ జోన్ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి అధికారులకు కరోన గురించి జాగ్రత్తలు, సలహాలు, సూచనలు వివరించామని తెలిపారు. కరోన గురించి ప్రజలకు అవగాహన కల్పించమని, రెడ్ జోన్లో ఉన్నవారికి తగు సదుపాయాలు కల్పించాలని, ఎప్పట్టికప్పుడు      బ్లీచింగ్ చల్లమని, సానిటైజ్ చేయమని పారిశుద్ధ్య కార్మికులకు తెలిపారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...