నేడు టౌన్ ఎస్ఐ డిశ్చార్జ్
పెన్ పవర్, కందుకూరు ఆర్ సి ఇన్ చార్జి
గత కొంత కాలంగా కరోనా బారిన పడి నెల్లూరు ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఎస్ ఐ తిరుపతి రావు బుధవారం డిశ్చార్జి కానున్నట్లు డిఎస్పీ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. అనంతరం తిరుపతి రావు పదిహేను రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉంటారని శ్రీనివాసులు తెలిపారు. టౌన్ ఎస్ఐ తిరుపతి రావు క్షేమంగా డిశ్చార్జ్ అవుతున్నారన్న వార్త తెలియగానే పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే బుధవారం పలు శాఖల అధికారులు కూడా డిశ్చార్జ్ కానున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment