రెవిన్యూ రికార్డుల సవరణకు ఈ పంట నమోదు దోహదం వ్యవసాయశాఖ జెడి ప్రసాద్
సామర్లకోట, పెన్ పవర్
రైతులు వారి రెవిన్యూ రికార్డులను సరి చేసుకునేందుకు ఈ పంట నమోదు కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని దానిలో పాల్గొని రైతులు ఈ సేవలను వినియోగించుకోవాలని వ్యవసాయశాఖ జిల్లా సంయుక్త సంచాలకులు కెఎస్ వి ప్రసాద్ అన్నారు.సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామములో మంగళవారం మండల వ్యవసాయధికారి ఐ సత్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పంట నమోదు కార్యక్రమాన్ని జెడి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములకు సంభందించిన రైతు వివరాలు అన్నిటిని విఆర్వో నమోదు చేయనుండగా పంట వివరాలను వ్యవసాయ సహాయకులు నమోదు చేస్తారు అన్నారు.తద్వారా రెవిన్యూ రికార్డులు సరిచేసుకునే అవకాశం ఉంది అన్నారు.ఈ విధానం ద్వారా రైతులకు పంట భీమా ,ఇన్ పుట్ సబ్సిడీ ,పంటల కొనుగోలు ,వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాలు,ఇతర పథకాలు రైతులు పొందే అవకాశం ఉందన్నారు.అలాగే కౌలు రైతులు సిసిఆర్సీ కార్డులను పొందేందుకు అవకాశం ఉంటుంది అన్నారు.దానికి రైతులు అంతా వారి పంట పొలాల వివరాలను ఈ పంట నమోదు చేసుకోవాలన్నారు.ఇంకా పలు అంశాలపై ఆయన రైతులకు అవగహన కల్పించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఇంకా డిడిఎ మాధవరావు, ఎడిఎ పద్మాశ్రీ, ఎంఎఎ సత్య, వ్యవసాయ శాఖ సహయాధికారులు , వి ఆర్వోలు , రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment