*గుంపులుగా ఉండవద్దు.*
-- ఎస్సై శివప్రసాద్.
మండపేట పెన్ పవర్
-- మడికి గ్రామంలో గర్భిణి స్త్రీ తో పాటు ఓ యువకునికి పాజిట్ నిర్ధారణ.
ఆలమూరు మండలంలో కేసులు సంఖ్య అధికంగా నమోదు అవుతుండటంతో ప్రజలు ఎవ్వరూ గుంపులుగా (సామూహికంగా) ఉండవద్దని ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ హెచ్చరించారు. ఆలమూరు మండలం మడికి (నాగులపేట)లో ఓ గర్భిణి స్త్రీకి సోమవారం ఉదయం పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆ ప్రాంతానికి ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లతో సమీక్షించారు. అలాగే ఆ ప్రాంతంలో ఎవరైనా సమూహంగా గుమ్మికూడిన, అరుగులపై కూర్చున్న అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎంపిడివో జెఎ జాన్సీ, గ్రామ పంచాయితీ కార్యదర్శి కె మోక్షాఅంజలి ఆ ప్రాంతానికి చేరుకుని పంచాయితీ సిబ్బందిచే బ్లీచింగ్ చల్లించి రోడ్లపై నీటిని నిల్వ లేకుండా పనులు యుద్ధ ప్రాతిపదికపై చేపట్టారు. ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా ఎస్సై పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే మడికి గ్రామానికి చెందిన ఓ యువకుడు దవళేశ్వరం హార్లిక్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడని అతనికి ఆదివారం సాయంత్రం పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని ఆ యువకుడు ప్రస్తుతం బొమ్మూరు క్వారంటైన్ లో కోలుకుంటున్నారని తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సచివాలయ సిబ్బందికి, గ్రామ వాలంటీర్లకు, ఆశా కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ఆదేశించారు. అలాగే సమీప ప్రాంతంలో నలుగురు కుటుంబ సభ్యులకు గత నాలుగు రోజులుగా తరచూ జ్వరము వస్తున్నట్లు స్థానికులు తెలిపారు ఆ ప్రాంతానికి వైద్య ఆరోగ్య శాఖ వారు వెళ్లి పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
No comments:
Post a Comment