బక్రీదు పండుగ సందర్భంగా గోడవ జరిగితే చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు
పశ్చిమ గోదావరి ,పెన్ పవర్ బ్యూరో
సెప్టెంబర్ 2వ తేదీన జరుగనున్న బక్రీద్ పండుగ సందర్భంగా కాని మరే ఇతర రో జులలోగాని గేదెలు, ఎద్దులను గాని వధించడం, లేదా వధించడానికి అమ్మ చూపిన పాలిచ్చే గేదెలనుగాని, వ్యవసాయానికి ఉపయోగపడే ఎద్దులను చంపినా, చంపడానికి అమ్మినా అటువంటి వ్యక్తులపై 1977 గోవధ నిషేధం, పశుసంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించి అటువంటి నేరాలకు పాల్పడేవారిని వారెంట్ లేకుండానే అరెస్టు చేసే అధికారం ఉండటంతోపాటు, వేయి రూపాయల వరకు జరిమానా లేదా 6 నెలలవరకు జైలుశిక్ష లేదా రెండింటితోగాని నే రస్తులను శిక్షించడం జరుగుతుందని తెలిపారు. సకల జీవాల పట్ల దయాభావంతో మెలగడం పౌరుల ప్రాధమిక కర్తవ్యాలలో ఒకటిగా గ్రహించి తదనుగుణంగా అందరూ మెలగాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఆ ప్రకటనలో తెలిపారు.
No comments:
Post a Comment