Followers

తక్షణమే లబ్ధిదారులకు ఇండ్లను అందజేయాలి








తక్షణమే లబ్ధిదారులకు ఇండ్లను అందజేయాలి

 

 

అనకాపల్లి, పెన్ పవర్

 

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో నిర్మించిన ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు అందజేయాలని బిజెపి జనసేన నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని మెగా లేఅవుట్ ఆవరణలో బిజెపి, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంగ పాము నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొణతాల అప్పలరాజు మాట్లాడుతూ  గత ప్రభుత్వ హయాంలో కేంద్ర పథకం పీఎంఏవై పథకం ద్వారా నిర్మించిన ఇండ్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని, పేదలను ఇబ్బందులకు గురి చేయడం ప్రభుత్వానికి తగదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇండ్ల నిర్మాణం లో జరిగిన అవినీతిపై విచారణ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఇటుక ఇటుక లో అవినీతి చంద్రన్న పాలన అని, అడుగు అడుగు లో అరాచక జగనన్న పాలన, ప్రతి పేదవాడికి ఇల్లు బిజెపి కళ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పి. నాగేశ్వరరావు, బిజెపి నాయకులు కోలపర్తి  శ్రీను, వుడా రమేష్,  కిర్ల  అప్పారావు, నర్సింగ్ యాదవ్ జనసేన పార్టీ నాయకులు  జగదీష్, పెద్దిశెట్టి దుర్గ,  తాడి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


 

 




 




No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...