Followers

గోకవరం మండలాన్ని రాజమండ్రి జిల్లాలో కలపాలి


గోకవరం మండలాన్ని రాజమండ్రి జిల్లాలో కలపాలి.


.... వై ఎస్ ఆర్ సి పి మండల ప్రచార కమిటీ కన్వీనర్ ఉంగరాల ఆదివిష్ణు.


గోకవరం పెన్ పవర్.


గోకవరం మండలాన్ని రాజమండ్రి జిల్లాలో కలపాలని సోమవారం వైఎస్ఆర్ సిపి ప్రచార కమిటీ కన్వీనర్ ఉంగరాల . ఆదివిష్ణు విలేకర్ల సమావేశంలో తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోకవరం మండలం ప్రజలకు రాజమండ్రి నగరానికి అవినాభావ సంబంధం ఉందని ఆయన తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను పునర్విభజన చేయడం మంచిదే .కానీ ఇక్కడి ప్రజల మనోభావాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి గోకవరం మండలం ప్రజలకు జిల్లా కేంద్రంగా రాజమహేంద్రవరం ఉంటే అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రభుత్వం జిల్లాల విభజన చేసే ముందు గోకవరం మండల ప్రజలు జిల్లా కేంద్రంగా రాజమండ్రి ఉండాలా, కాకినాడ ఉండాలా సర్వే చేసి మెజార్టీ ప్రజలు ఏది కోరుకుంటే ఆ జిల్లాలో ఈ మండలానికి కలపాలని భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్ విభజన జరిగే అవకాశం ఉంది కనుక ఇప్పుడున్న పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలనుకోవడం సహేతుకం కాదని భౌగోళికంగా రాజకీయంగా వాణిజ్యపరంగా రాజమహేంద్రవరం తో దశాబ్దాల అనుబంధం కలిగిన గోకవరం మండలాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో కలపడమే సమంజసమని మండల ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...