ఓబుళాపురం లో కరోనా పాజిటివ్
గిద్దలూరు, పెన్ పవర్
గిద్దలూరు మండలం ఓబులాపురం లో కరోనా పాజిటివ్ కేసు నమోదు
అప్రమత్తమైన అధికారులు, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన
సీఐ సుధాకరరావు
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురం గ్రామంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో... అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఓబులాపురం గ్రామం చేరుకున్నారు. సీఐ సుధాకరరావు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు., కరోనా పాజిటివ్ నమోదైన వ్యక్తిని ఐసోలేషన్ తరలించేందుకు ఏర్పాట్లు చేేశారు. గ్రామాన్ని కంటోన్మెంట్ జోన్ గా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అలానే కరోనా పాజిటివ్ నమోదైన వ్యక్తితో ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారు..? గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు, సదరు కరోనా పాజిటివ్ నమోదైన వ్యక్తితో ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలానే గ్రామ ప్రజలు ఎవరు కూడా కంటోన్మెంట్ జోన్ దాటి బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని,కరోనా అనుమానిత లక్షణాలు కలిగి ఉంటే తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు.
No comments:
Post a Comment