Followers

ఎంపి విజయ సాయి రెడ్డి సహకారంతో మత్స్యకారులకు బియ్యం పంపిణీ




ఎంపి విజయ సాయి రెడ్డి సహకారంతో మత్స్యకారులకు బియ్యం పంపిణీ చేసిన కొల్లి సింహాచలం

 

పూర్ణా మార్కెట్,పెన్ పవర్.

 

జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద మత్స్యకారులకు ప్రముఖ సంఘ సేవకులు 39వ వార్డు వై ఎస్ అర్ సి పి కార్పొరేటర్ అభ్యర్థి కొల్లి సింహాచలం అండగా నిలిచి ఆదుకున్నారు..వివేకానంద సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మత్స్యకారులకు  బియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగ ఆమె మాట్లాడుతూ నిరుపేదలకు అన్ని వేళలా అండగా ఉండి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వేలాది నిరుపేద కుటుంబాల కోసం భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టానని వెల్లడించారు. బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు, రొట్టెలు, సబ్బులు, మాస్కులు  అందజేశామని తెలియజేశారు.నిరుపేదల కోసం భారీ స్థాయిలో ..సేవా కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె ప్రకటించారు..ఈ సేవా కార్యక్రమంలో .. సూరాడ అప్పారావు, పోలవరపు అప్పలకొండ, వాసుపల్లి ఉమాదేవి, ఉమా దేవి, భవాని, వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...