Followers

వినయ విధేయ పవన్







వినయ.. విధేయ.. పవన్


అందరి మన్ననలు అందుకుంటున్న హెల్త్ అసిస్టెంట్


 కరోనా విపత్కరి పరిస్థితిలో ప్రజలకు అండగా సేవలు


 పేదలకు తన వంతు ఆర్ధిక సహాయం


        


గోకవరం ,పెన్ పవర్ 


 

వినయంగా ఉండటం.. విధేయత చూపించటం అతనికున్న మంచి లక్షణం.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఆపన్నులకు ఆర్ధిక సహాయం చేయటం భగవంతుడు ఇచ్చిన వరం.. వ్యాధులతో బాధపడుతున్న వారికి వెంటనే వైద్య సేవలు అందించటం, తక్షణం మెరుగైన చికిత్స కల్పించటం వృత్తి రీత్యా ఆయన అలవర్చుకున్న నైజం.. కరోనా సమయంలో అందరికి సలహాలు, సూచనలు ఇస్తూ, తమ పరంగా ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఇతనిని మండల ప్రజలు, నాయకులు అధికారులు ముక్తకంఠంతో అభినందిస్తున్నారు.ఇతని సేవలు గుర్తించి అందరూ వినయ విధేయ పవన్ అని పిలుస్తున్నారు..గోకవరం మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో హెల్త్ అసిస్టెంట్ గా పని చేస్తున్న పవన్ మంచి మనసున్న ఉద్యోగి గా పేరు తెచ్చుకున్నాడు. కరోనా మహమ్మారి విరుచుకు పడుతున్న నేపధ్యంలో ప్రజలకు సూచనలు సలహాలు ఇవ్వటం జరుగుతుంది. ఎవరికైనా కరోనా సోకితే భయపడాల్సిన పని లేదని, చికిత్స తీసుకుంటే సరిపోతుందని ఇళ్లకు వెళ్లి వారికి ధైర్యం చెపుతున్నాడు. కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళ విషయంలో వివక్షత ఎవరు చూపకూడదని,   14 రోజుల్లో తిరిగి మాములుగా తిరుగుతారని, ఎవరు బయపడాల్సిన అవసరం లేదని వివరించటం చేస్తున్నారు. తమ పీహెచ్ సి వైద్యులు, సిబ్బందితో కలిసి కరోనా విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన సదస్సులు నిర్వహించటం జరిగింది. వివిధ కారణాల తో ఎవరైనా మరణిస్తే వెంటనే అక్కడికి వెళ్లి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేయటంలో పవన్ ముందుంటాడు. రోజుకి లెక్కకు మించి ఫోన్లు వస్తున్న విసుక్కోకుండా అందరికి సలహాలు, సూచనలు ఇవ్వటం జరుగుతుంది. ఈ విధమైన సేవలతో పాటు తనకు వచ్చే జీతంలో కొంత పేదలకు సహాయం చేసే దయగుణం ఉన్న వ్యక్తి పవన్.. పేదలకు పళ్ళు, కూరగాయలు పంపిణీ చేయటం తో పాటు కొంతమంది కి ఆర్ధిక సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం గోకవరం మండలం లో కరోనా విలయతాండవం చేస్తుంది. చాలా మంది అధికారులకు, రాజకీయ నాయకులకు కరోనా సోకటం జరిగింది. ఇప్పటికి కేసులు పెరుగుతూనే ఉన్నాయి..వీరందరికి అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నాడు. గోకవరం ప్రభుత్వ హాస్పిటల్ పేరు చెపితే మొదటగా వినిపించే పేరు పవన్. ఎందుకంటే అందరిలో ఒక్కడిగా కలిసిపోయాడు. ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న ఇటువంటి వైద్య సిబ్బందిని ఉన్నత స్థాయి అధికారులు గుర్తించి అభినందించాల్సి ఉంది. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి వేరే కారణాలతో చనిపోతే పవన్ ఇచ్చిన సూచనలు, సలహాలు వల్ల అందరికి మంచి జరిగింది. కుటుంబ సభ్యులు నేరుగా ధన్యవాదాలు చెప్పారు. అందుకే ప్రజలంతా ఇతనిని వినయ విధేయ పవన్ అని పిలుస్తున్నారు..


 

 




No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...