మద్యంకోసం ఎన్ని ఆంక్షలు విధించినా పాటిస్తాం..!
ఛత్రీలతో బారులుతీరి ఎగబడుతున్న మందుబాబులు.
సామర్లకోట, పెన్ పవర్
మద్యం కొనేందుకు కరోనా వ్యాప్తి చెందుతున్న అధికారులు ఎన్ని ఆంక్షలు విధించినా మేము మాత్రం మద్యం కొనుగోలు మాత్రం మానేది లేదనే ధోరణిలో మద్యం బాబులు ఎగబడుతున్నారు.జిల్లాలో కరోనా కేసులు కట్టలు తెంచుకుంటున్న నేపధ్యంలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు ఎలాంటి సామాజిక దూరాన్ని పాటించకుండా ఎగపడుతున్న పరిస్థితులు ఉన్నందున వారిని కరోనా వ్యాధి నుంచి కాపాడేందుకు గాను జిల్లా కలెక్టర్ ఒక అలోచన తో మద్యం కొనుగోలుకు వెళ్లే వారు విధిగా గొడుగులు వేసుకుని మాత్రమే వెళ్ళాలి అని అలా రాని వారికి మద్యం విక్రయాలు జరుపవద్దు అని తాజాగా ఆంక్షలు విధించారు.దానితో మంగళవారం తెల్లవారకుండానే ఆ విషయం తెలుసుకున్న మందు ప్రియులు గొడుగులతో మద్యం దుకాణాల వద్ద బారులు తీరి ప్రత్యక్ష మయ్యారు.ఆ దృశ్యం పట్టణ పరిధిలో ప్రజలను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది.దీనిని బట్టి మద్యం విలువ ఆ ప్రియులకు ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. ఏమైనా మద్యం దుకాణాల వద్ద కొనుగోలు దారులు సామాజిక దూరాన్ని పాటించాలి అని అధికారుల ఆలోచన దానికి చేసిన ప్రయోగం మాత్రం చక్కగా పనిచేసింది.గొడుగులతో నిలిచి ఉన్న ప్రజలు వారికి తెలియకుండానే దూరాన్ని పాటించడం తో కొంత మేర కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేసినట్టు అయిoది. అయితే వర్షం లేకుండానే మందు ప్రియులు గొడుగులు వేసుకుని మరీ మద్యం కొనుగోలు చేయడం మాత్రం కొత్త వరవడిని తెచ్చినట్టయిoది.
No comments:
Post a Comment