కోటి పరిహారం ప్రకటించాలి
అనకాపల్లి, పెన్ పవర్
పరవాడ ఫార్మాసిటీలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన కాండ్రేగుల శ్రీనివాసరావు అతని కుటుంబానికి నష్టపరిహారంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ప్రకటించి మానవత్వాన్ని చాటుకోవాలని శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొణతాల వెంకటరావు విజ్ఞప్తి చేశారు. కాండ్రేగుల శ్రీనివాసరావు స్వస్థలం అనకాపల్లి సంతోషిమాత కోవెల ప్రాంతంలో నివాసం ఉండేవారని ప్రస్తుతం బట్ల పూడి గ్రామంలో తన తల్లి ఇద్దరు కుమార్తెలతో నివాసం ఉంటున్నారనారు. ఎల్జి పాలిమర్స్ వెంకటపాలెం లో జరిగిన విధంగానే పరవాడ ఫార్మాసిటీలో విశాఖ సాల్వెంట్స్ కంపెనీలో సీనియర్ కెమిస్ట్రీ గా పనిచేస్తున్నారని కంపెనీ యొక్క నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిన కారణంగా అతను చనిపోయాడు అని కంపెనీ యాజమాన్యం ఎటువంటి సేఫ్టీ పద్ధతులు పాటించకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయనారు. ఇటీవల జరిగిన ఎల్జి పాలిమర్స్ మరియు ఇతర ప్రాంతాల్లో ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు గా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయకపోవడం వారి దగ్గర నుండి మామూలు తీసుకొని చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఇకనైనా బాధ్యతగా అన్ని కంపెనీలు ప్రతి నెలా తనిఖీలు చేసి నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఎటువంటి ఆధారం లేదని అతని పైనే ఆధారపడి తల్లిని ఇద్దరు కుమార్తెలు పోషించుకుంటూ ఉన్నాడని 2 సంవత్సరాల క్రితం అతని భార్య కూడా చనిపోయిందని అటువంటి కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారంతో పాటు కంపెనీ నుండి కూడా నష్టపరిహారం ఇస్తూ వారి కుటుంబానికి ఆధారం చూపించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment