మొగిలిచర్ల లో ప్రధాన రహదారిపై ఆంక్షలు ఎత్తివేయాలి
పెన్ పవర్ కందుకూరు ఆర్ సి ఇన్ చార్జి
ఈనెల 1వతేదీ మొగిలిచెర్ల గ్రామం లో ఒకే కుటుంబంలో 6 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ జరిగాయని, గ్రామం లోని ప్రధాన రహదారిని మూసివేశారు.. ఆ కుటుంబం మొత్తానికి మరో వారం తరువాత నెగటివ్ వచ్చింది. వాళ్ళు క్షేమంగా వున్నారు, కానీ ప్రధాన రహదారిపై రాకపోకలపై నిషేధం మాత్రం అలానే ఉంచారు.తాతాహోటల్ నుంచి పామూరు వెళ్లే ప్రధాన రహదారి కావడం తో అదినిత్యం రైతులు తమ తమ పొలాలకు వెళ్లాలన్నా, సరుకు రవాణా చేయాలన్నా,అదే రహదారి దిక్కు. ఇప్పటికి 19 రోజులు గడిచాయని,గ్రామం లో ని మిగతా ప్రాంతాలను కంటైన్మంట్ లో వుంచినా కనీసం ప్రధాన రహదారిపై ఆంక్షలను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
No comments:
Post a Comment