Followers

అంతరించిపోతున్న అడ్డాకుల చెట్లు



అంతరించిపోతున్న అడ్డాకుల చెట్లు

 

*ఆదివాసీలకు అడ్డాకు చెట్టు పై  

అటవీశాఖ అవగాహన కల్పించాలి

 

చింతపల్లి   పెన్ పవర్

 

  ఏ శుభకార్యమైనా విస్తరాకులు వేయాల్సిందే! దానిలో పప్పన్నం తినాల్సిందే! కానీ నేడు కాలం మారింది.ఆధునిక పేరుతో జనాలు మన సంస్కృతి, సాంప్రదాయాలు విస్మరించారు. భోజనం చేయడానికి కూడా తీరిక ఉండడం లేదు. కృత్రిమంగా తయారుచేసిన పేపర్ ప్లేట్ లో నిలబడి( బఫె) హడావిడిగా తినేస్తున్నారు. అడ్డాకులతో చేసిన విస్తరాకులకు ఆదరణ తగ్గింది. అయినప్పటికీ గుళ్లు, గోపురాల్లో ఇంకా విస్తరాకులు వినియోగిస్తున్నారు. అడ్డాకులు అంతరించిపోయే పరిస్థితి నెలకొంది. ఆదివాసీలకు అటవీశాఖ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విశాఖ మన్యంలో ప్రకృతి సిద్ధంగా లభించే తీగజాతి సంతతికి చెందినది ఈ అడ్డ చెట్టు. ఏ జాతి చెట్టయినా దానిలో కొన్ని భాగాలు మాత్రమే ఉపయోగపడతాయి.ఉదాహరణకు అడవిలో టేకు చెట్టు కలప గృహ అలంకరణ కు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది. కానీ అడ్డ చెట్టు అలా కాదు. దాని ఆకులు,కాండం,పిక్కలు ఏ ఒక్కటి కూడా పనికి రాదు అనడానికి వీలు లేదు. అడ్డాకుల తో విస్తరాకులు తయారు చేస్తారు. అడ్డ పిక్కలు వేపుకొని తింటే  ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ పిక్కలు తినడం వలన ఏ మాత్రలు వాడకుండా చిన్న పిల్లలతో పాటు పెద్దవారి కడుపులో నులి పురుగులు చనిపోతాయి. ఇక కాండం. శీతాకాలంలో కాండం మీద ఉన్న పొరను ఒలిచి తాడులా  ఉపయోగిస్తారు. ఈ తాడు  ఇనుప తీగ కంటే గట్టిగా ఉంటుంది. ఈ అడ్డ చెట్టు ను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెడతారు. శీతాకాలంలో వీటిని మంట పెట్టుకుంటే తెల్లవార్లు నిప్పులు అలాగే ఉండి గదిలో వేడిగా ఉంటుంది. గిరిజనులు చలి నుంచి ఉపశమనం పొందేందుకు విరివిగా ఈ చెట్లను బలి తీసుకుంటున్నారు. ఇప్పటికైనా గిరిజనుల్లో అవగాహన కల్పించకుంటే విస్తరాకు లకు అంతం ప్రారంభమైనట్లే.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...