Followers

విశాఖ కి చేరుకున్న ఆర్మీ ఉద్యోగి మృతదేహం







విశాఖ కి చేరుకున్న ఆర్మీ ఉద్యోగి మృతదేహం.

     

విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)

 

 

కార్గిల్ లో అసువులు బాపిన ఆర్మీ అధికారి మృతదేహం మంగళవారం రాత్రి విశాఖ విమానాశ్రయం కు చేరుకుంది. విశాఖ ఆర్మీ అధికార్లు గోపాలపట్నం తహశీల్దారు బి.వి రాణి మృతదేహానికి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం ఆర్మీ వాహనంలో మృతదేహాన్ని స్వగ్రామం సిక్కులు కు తరలించారు.

ఈనెల 19వ తారీఖు శనివారం కార్గిల్ సమీపంలో తీవ్రవాదుల అమర్చిన బాంబులను నిర్వీర్యం చేస్తున్నప్పుడు  ఒక బాంబు పేలడంతో శ్రీకాకుళం జిల్లా వాసి ఆర్మీ ఉద్యోగి లావేటి ఉమామహేశ్వర రావు తీవ్ర గాయాల పాలయ్యాడు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు ఈ సమాచారం కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు ఆదివారం తెలియజేశారు, ఈయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈయన పార్థివ దేహాన్ని ఈరోజు రాత్రి ఢిల్లీ నుంచి విశాఖపట్నం విమానంలో తీసుకువచ్చారు

విశాఖ విమానాశ్రయంలో ఆర్మీ అధికారులు మరియు గోపాలపట్నం ఎమ్మార్వో రాణి మృతదేహన్ని లాంచనంగా స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ఆర్మీ అధికారులు ఏర్పాటు చేసిన వాహనంలో భౌతికకాయాన్ని శ్రీకాకుళం తీసుకుని బయలుదేరారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆర్మీ అధికారులు తెలియజేశారు..


 

 




 



 



 



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...