వి ఆర్ పురం మండలంలో కరోనా టెస్ట్లు.
వి ఆర్ పురం, పెన్ పవర్
తూర్పుగోదావరి జిల్లా వి ఆర్ పురం మండల పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవటంతో మండలం లోని ప్రజలు భయాందోళనకు గురైనారు. ఈలాంటి సమయములో చింతూరు ఐ టి డి ఎ పి ఓ ఆదేశాల మేరకు మండలంలోని యం ఆర్ ఓ ,యం డి ఓ ,డాక్టర్లు ఏ ఎన్ యం లు.ఆశావర్కర్లు, అందరి సహకారంతో కరోనా టెస్టులు మంగళవారం పత్రిక విలేకర్లు, మేజిక్,ఆటో డ్రైవర్లు,వ్యాపారస్తులు, అందరికి ప్రభుత్వ జూనియర్ కాలేజి ఆవరణంలో డాక్టర్ సుందర్ ప్రసాద్ ఆధ్వర్యంలో టెస్టులు నిర్వహించినగా, మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గున్నారు.ఈకార్యక్రమంలో మండల తహశీల్దార్ ఎన్ శ్రీధర్,యం పి డి ఓ శ్రీనివాస్ రావు,డాక్టర్ సుందర్ ప్రసాద్, సెక్రెటరీ సుబ్రమణ్యం,ఎ ఎన్ యం లు ఆశావర్కర్లు, వి ఆర్ ఓ లు,వి ఆర్ ఏ లు ,మండలం ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment