Followers

మొబైల్ కోవిడ్ టెస్టింగ్ వెహికిల్ "సంజీవని" ఏలేశ్వరం రాక





మొబైల్ కోవిడ్ టెస్టింగ్ వెహికిల్ "సంజీవని" ఏలేశ్వరం రాక

 

ఏలేశ్వరం, పెన్ పవర్

 

స్థానిక నగర పంచాయతీ, ఏలేశ్వరం మండల పరిధి గ్రామాల్లో కరోనా మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ మేరకు మరింత మందికి కరోనా సోకకుండా ఉండేందుకు కోవిడ్- 19 పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ చొరవ మేరకు కాకినాడ డిఎంఅండ్ హెచ్ ఓ ఆదేశాల మేరకు కరోనా రోగుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ఉన్నవారికి ఏపీఎస్ఆర్టీసీ కి చెందిన సంజీవిని బస్సులో కోవిడ్-19 పరీక్షలు చేసేందుకు గురువారం ఏలేశ్వరం వచ్చింది. ఈ వాహనంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు డి రవీంద్రనాథ్, ఏ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విరివిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మండల వైద్యాధికారి ఏ విరమణ, ఎస్ ఐ కే సుధాకర్, వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు.


 

 




 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...