Followers

రైల్వే ప్రైవేటీకరణ విధానాలకు నిరసిస్తూ


రైల్వే ప్రైవేటీకరణ విధానాలకు నిరసిస్తూ.


సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో నిరసన


పెన్ పవర్ తాడేపల్లిగూడెం


పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో రైల్వే స్టేషన్ వద్ద
సి.ఐ.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబూరావు ఆధ్వర్యంలో
రైల్వే ప్రవేటీకరణ విధానాలకు నిరసిస్తూ సి.ఐ.టి.యు ఆధ్వర్యం లో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు .  బాబూరావు మాట్లాడుతూ కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తుా,ప్రజలందరికి తక్కువ ధరకు ప్రయాణ సధుపా యాన్ని అందిస్తున్న రైల్వే లను కేంద్ర ప్రభుత్వం ప్రవేటీకరించడాన్ని  ఆయన తీవ్రంగా ఖండించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పోరేట్  శక్తులకు కట్టపెట్టడానికి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటీకరిస్తున్న దని విమర్శించారు.ప్రజల ఆస్థితో స్థాపించుకున్న సంపదలను ప్రవేట్ వారికి అప్పగించడం సరైనది కాదన్నారు.ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవడానికి ప్రజలంతా ఉద్యమించాలన్నారు.ఈ కార్యక్రమం లో సి.ఐ.టి.యు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు ,నాయకులు మడక రాజు,కరెడ్ల రామకృష్ణ ,జవ్వాది శ్రీను తదితరులు పాల్గొన్నారు .


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...