కరోనాని సమయంలో పందుల పోటీ లాడిన పందెం జూదరులు
పరవాడ, పెన్ పవర్
పరవాడ:ప్రపంచమంతా కరోనా సమస్యతో బాధపడుతుంటే అచ్యుతాపురం,గాజువాక యువత (చూసిన వారు చెప్పింది) మాత్రం కరోనాని లెక్కచేయకుండా కనీసం ముఖానికి మాస్క్ కూడా పెట్టు కోకుండా వింత పోకడలతో వింత పోటీలు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు.మండలం లోని భరిణికం చెరువులో సుమారు100 నుంచి 150 మంది అచ్యుతాపురం, లనుంచి వచ్చిన 17 నుండి 27 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువకులు పందుల పోటీ నిర్వహించారు.పందుల యజమానులు రెండు పందులను రెచ్చగొట్టి ఒకదానికి ఒకటి ఎదురు తీసుకు వెళ్లి కేకలతో అరుపులతో వాటిని రెచ్చ గొట్టగా అవి రెండూ ఢీకొనగా క్షణాలలో నే ఒకపంది ఓడిపోయి పారిపోవడం జరిగింది అని స్థానికం గా చూసినా వారు చెప్పారు.పందెం విలువ లక్షల్లో ఉంది అని అక్కడ ఉన్న స్థానికులు చెప్పారు. అచ్యుతాపురం,గాజువాక లలో కరోనా కేసులు ఎక్కువ కావడం వచ్చిన వారు కనీసం మాస్క్ కూడా లేకుండా రావడం తో వీరిని చూసి స్థానికులు భయంతో పోలీసు వారికి ఫోన్ చేయగా వారు వచ్చే లోపే క్షణాల్లో పoదేం ముగియడం మెరుపు వేగంతో యువకులు ఎటువారు అటు తమ దిచక్ర వాహనాలు,కార్లు,ఆటోలలో పరారయ్యారు.
No comments:
Post a Comment