హోమ్ ఐసోలేషన్ లో పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్
పరవాడ, పెన్ పవర్
నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రజాప్రతినిధులకు కరోనా వైరస్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉండడంతో ప్రజా ఆరోగ్యం దృష్ట్యా పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అధికార పార్టీకి చెందిన ఎక్కువ మంది శాసనసభ్యులు కరోనా వైరస్ బారిన పడుతున్న దృష్ట్యా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పది రోజుల పాటు అధికార, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటునున్నట్లు తెలిపారు. గృహ నిర్బంధంలో ఉన్నప్పటికీ అధికారులకు, పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఫోన్లో నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు. అధికారులు, ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, సహకరించాలని కోరారు.
No comments:
Post a Comment