Followers

పాలకొల్లు పట్టణంలో భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన పాలకొల్లు  పట్టణ పోలీసులు



పాలకొల్లు పట్టణంలో భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన పాలకొల్లు 


పట్టణ పోలీసులు



పెన్ పవర్ పశ్చిమ గోదావరి బ్యూరో


పాలకొల్లు పట్టణంలో భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన పాలకొల్లు పట్టణ పోలీసులు, గంజాయి నీ సరఫరాను చేస్తున్న మూలాలను కనుగొనీ ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసిన పాలకొల్లు పోలీసులకు జిల్లా ఎస్పీ కె ఎన్ నారాయణ్ ఐపీఎస్ మరియు పశ్చిమగోదావరి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ  కరీముల్లా షరీఫ్  పాలకొల్లు పట్టణ పోలీసు వారిని అభినందించారు


పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి  కె ఎన్ నారాయణ్ ఐపీఎస్ మరియు పశ్చిమగోదావరి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పి  కరీముల్లా షరీఫ్  యొక్క ఆదేశాలపై పాలకొల్లు టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులు, పాలకొల్లులో భారీ స్దాయిలో 435 కేజీ లు గంజాయి, డస్టర్ కారు ను స్వాధీనము చేసుకున్నరు పశ్చిమ గోదావరి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కె.ఎన్.నారాయణ్, ఐ.పి.యస్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ  కరీముల్లా షరీఫ్ వారి ఆదేశాల ప్రకారం. ఈమధ్య భారీ స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్  వర్క్ ను చేపడుతున్న  పోలీస్ లకు నిన్న రాత్రి నరసాపురం సబ్ డివిసన్ లో పాలకొల్లు టౌన్ శివారులోని స్వప్నబార్ దగ్గర పోలీస్ లు నిర్వహించిన  ఆకస్మిక వాహన తనిఖీలో విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి డస్టర్   కార్ లో తరలిస్తున్న  సుమారు 435 కె.జి ల గంజాయిని,   ఆ కార్ పోలీస్ లకు చిక్కకుండా బైక్ పై ఎస్కార్ట్ చేసుకుంటూ వస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను పోలీస్ లు పట్టుకోవడం జరిగింది, ఈరైడ్ లో 21,75,000/- విలువ కలిగిన గంజాయి, ఒక డస్టర్  కార్, రెండు బైక్ లు, రెండు సెల్ ఫోన్ లు, పోలీస్ లు స్వాధీనం చేసుకుని ఆ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది అని నరసాపురం డి.ఎస్.పి నాగేశ్వరరావు  ప్రెస్ మీట్ లో  వివరాలు వెల్లడించారు. ఆ ముగ్గురు ఇచ్చిన సమాచారం మేరకు గంజాయిని అమ్ముతున్న మిగిలిన ముద్దాయిల కోసం పోలీస్ లు గాలింపుచర్యలు చేపట్టారు.  ఈ రైడ్ లో పాల్గొన్న పాలకొల్లు టౌన్ సి.ఐ. సిహెచ్. ఆంజనేయులు , ఎస్ఐ అయిన ఎఫ్. రహమాన్, జె.వి. ఎన్ ప్రసాద్ , మరియు వారి సిబ్బందిని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పి . . యస్. ఈ.బి  అదనపు ఎస్పీ  సిబ్బందిని అభినందించారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...