వేoకటాపురం గ్రామంలో ప్రతి ఇంటికి శానిటైజర్ బాటిల్స్ పంపిణీ చేసిన
బలిరెడ్డి శ్రీనివాసరావు
మునగపాక పెన్ పవర్
మునగపాక మండలం:భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బలిరెడ్డి శ్రీనివాసరావు ఆద్వర్యంలో వెంకటాపురం గ్రామంలో ప్రతీ ఇంటికీ శానిటైజర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగినది.ఈ కార్యక్రమానికి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంతిన భక్త సాయిరామ్ ముఖ్య అతిధిగా విచ్చేశి నరేంద్ర మోదీ రెండవ సారి ప్రధాన మంత్రిగా భాద్యతలు చేపట్టిన ఈ సంవత్సరకాలంలో ఆయన చేపట్టిన అనేక సంస్కరణలు, ప్రజాప్రయోజన కార్యక్రమాలను తెలియజేసారు ,కరోనా మహమ్మారి నుండి భారతదేశాన్ని , దేశ ప్రజలను సంరక్షించుటకు తీసుకున్న నిర్ణయాలకు ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందారు, అని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంగుపాం నాగేశ్వరరావు,పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పొలమరశెట్టి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వూడా రమేష్ ,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
No comments:
Post a Comment