లుకేమియా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఉద్ధేష్ కుటుంబాన్ని ఎంపీ తో కలిసి పరామర్శిoచిన ఆధీప్ రాజ్
అన్ని విధాల సహాయం చేస్తామని హామీ
బాలుడు వైద్యానికి వ్యక్తిగతంగా రు"50 వేలు ఆర్థిక సహాయం.
పరవాడ పెన్ పవర్
పరవాడ : పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజు మాట ఇచ్చారు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పరని మరొక సారి రుజువు చేశారు.మండలం లోని భరినికం గ్రామంలో లుకేమియా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న జర్నలిస్ట్ బొండా నాని నాలుగేళ్ల కుమారుడు ఉద్దేశ్ కుటుంబాన్ని ఆదుకుంటానని ఇచ్చిన మాట ప్రకారం మంగళవారం ఉదయం అనకాపల్లి ఎంపీ డా"బి. సత్యవతమ్మ తో కలిసి పరామర్శించారు.బాలుడు ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. బాలుడు వైద్యానికి అవసరమైన సహాయం తప్పకుండా అందిస్తామని హామీ ఇచ్చి వారికి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి సహాయనిధి నుండి ఏది అవకాశం ఉంటే ఆ నిధి నుండి బాలుడు వైద్యానికి అవసరమైన నిధులు సమకూరుస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా రూ" 50వేలు నగదును ఉద్దేశ్ కుటుంబ సభ్యులకు అందజేసి మనసున్న ఎమ్మెల్యే అనిపించుకున్నారు.జర్నలిస్ట్ కుటుంబంపై పెందుర్తి ఎమ్మెల్యే చూపించిన శ్రద్ద, జర్నలిస్టులపై ఎమ్మెల్యే కు ఉన్న అభిమానానికి నిదర్శనమని స్థానిక జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భర్త వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా"విష్ణుమూర్తి, స్థానిక వైసీపీ నేత మండల వైసిపి యూత్ అధ్యక్షులు పెద శెట్టి శేఖర్, వైసిపి సెంట్రల్ కమిటీ సభ్యులు పయిల శ్రీనివాసరావు, వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి పయిల సన్యాసి రాజు, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కా రామునాయుడు,మండల వైసిపి పార్టీ అధ్యక్షుడు సిరిపురపు అప్పలనాయుడు,స్థానిక వైసీపీ నాయకులు తదితర నాయకులు ఉద్దేశ్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఉన్నారు.
No comments:
Post a Comment