విశాఖ సాల్వేoట్ ప్రమాదానికి కారణం అయిన యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి
పరవాడ పెన్ పవర్
పరవాడ:జవహర్ లాల్ నెహ్రు ఫార్మాసిటీ పర్యవేక్షణ సవస్థ రామ్ కి నడుపుతున్న విశాఖ సాల్వేoట్ కంపెనీలో సోమవారం రాత్రి 10.30 ని జరిగిన భారీ అగ్నిప్రమాదం కేవలం యాజమాన్య నిర్లక్ష్యం వలనే జరిగింది అని ఫార్మాసిటీ స్టాఫ్&వర్కర్ల యూనియన్ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి సత్యాన్నారాయణ ఆరోపించారు. కంపెనీ యాజమాన్యం పై పోలీసు కేసుపెట్టి అరెస్ట్ చేయాలి అని లంకెలపాలెం లో కార్మికులతో కలిసి నిరసన రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా గనిశెట్టి మాట్లాడుతూ సాయినార్ ఫార్మా గ్యాస్ లీక్ లో ఇద్దరి మృతి చెందిన ఘటన మరవక ముందే విశాఖ సాల్వేoట్ ప్రమాదం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది అని కార్మికుల ప్రాణాలకు ఫార్మాలో భద్రత లేదు అని మరోసారి రుజువు అయ్యింది అన్నారు.ఫార్మాసిటీ ని అభివృద్ధి చేయు సవస్థ గా ఉన్న రామ్ కి ఫార్మా కంపెనీలలో భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా చూడటంలో విఫలమైంది అని ఆరోపించారు.ఫార్మా లో జరుగుతున్న ప్రమాదాల నివారణా బాధ్యత రామ్ కి దే అని కానీ రామ్ కి ఆ భాద్యతలో విఫలం అయింది అని అన్నారు.విశాఖ సాల్వేoట్ లో జరిగిన ప్రమాదం ఫార్మాలో ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో కన్నా పెద్ద అగ్నిప్రమాదం అని అన్నారు.సకాలంలో అగ్నిమాపక దళాలు ప్రమాద స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని అరికట్ట గలిగారు కానీ లేకపోతే ఈ కంపెనీలో జరిగిన భారీ పేలుళ్లకు ఇతర కంపెనీలకు వ్యాపిస్తే జరిగే పరిస్థితులు ఊహిస్తే ఒళ్ళు జలదరిస్తోంది అని ఆవేద వ్యక్తం చేశారు.పోలీసు శాఖ ప్రమాదం జరిగినప్పుడు కార్మికుల రక్షణకోసం వారిని పరామర్శించడానికి వచ్చే మమ్మని కానీ ఇతర పార్టీ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకు వెళుతున్నారు కానీ ప్రమాదాలకు కారణం అవుతున్న కంపెనీ యజమాన్యాలకు వారి అడుగులకు మడుగులెత్తుతున్నారు అని ఆరోపించారు.విశాఖ సాల్వేoట్ లో నిల్వ ఉన్న కెమికల్ వ్యర్దాలలో రియాక్షన్ జరిగి ప్రమాద రహిత వాయువులు(గ్యాస్)రాకుండా ఉండటానికి అందులో కొన్నిరకాల ద్రావణాలను కలుపుతారు అని ఆ ప్రమాద నివారణా ద్రావకాల యొక్క పరిమాణం తగ్గటం వలన రసాయనాల ట్యాoక్ లో ఏర్పడిన అధిక ఉష్నోగ్రత తో ఈ అగ్నిప్రమాదం జరిగింది అని అధికారులు సూచన ప్రాయంగా తెలియ చేశారు అని గనిశెట్టి అన్నారు.
వ్యర్ధ ట్యాకుల్లో ఏర్పడుతున్న అధిక ఉష్నోగ్రతల వలన పొగలు వస్తున్న విషయం కంపెనీ యాజమాన్యానికి తెలిసినా కూడా ఎటువంటి నివారణా చర్యలు తీసుకోకుండా ఇంత పెద్ద ప్రమాదానికి కారణం అయిన యాజమాన్యం పై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి అని సత్యన్నారాయణ డిమాండ్ చేశారు.ఫార్మా కంపెనీలలో పనిచేసే కార్మికులు తమ ప్రాణాలను గుప్పెటలో పెట్టుకుని పని చేయవలసి వతుంది అని విచారం వ్యక్తం చేశారు.వీరే కాకుండా నిర్వాసిత గ్రామాలలోని ప్రజలు కూడా వరుస ప్రమాధాలతో భయ బ్రాoతులు అవుతున్నారు అని విశాఖ సాల్వేoట్ ప్రమాదం లో ఏర్పడిన విస్ఫోటన శబ్ధాల వలన తాడి,తాణాo,పరవాడ గ్రామాల్లోన్ని ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీశారు అంటే ప్రమాద తీవ్రత అంత ఎక్కువ ఉంది అని అన్నారు.ఈ ప్రమాదంలో మృతునికి కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి అని అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలతో పాటు 30 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.వెంకటరావు,పి.చిరంజీవి,ఎమ్.సంతోష్,అది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment