వి ఆర్ పురం . పెన్ పవర్
వి ఆర్ పురం మండలంలో రేఖపల్లి పి హెచ్ సి లో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయుచున్న ఆధికారులకు కరోనా టెస్ట్లు 14 మందికి చేయగా అందులో రేఖపల్లి పి హెచ్ సి కి సంబంధించిన అధికారికి మరియు సున్నవారిగూడెం లో ఒక వ్యక్తి కి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ సుందర్ ప్రసాద్ తేలిపారు.వీరిని శనివారం సాయంకాలం క్వారంటేన్ కి తరలిస్తామని మీడియాకి తెలిపారు. ముందు జాగ్రత్త కారణంగా రేఖపల్లి పి హెచ్ సి కి మూడు రోజులు బంద్ ప్రకటించారు మండలం లోని ప్రజలను వైద్యశాలకు అనుమతించటలేదు.
ఎమర్జెన్సీ కేసులు వచ్చినట్లైతే కూనవరం,కోతులగుట్ట పి హెచ్ సి కి తరలిస్తామని ప్రజలకు తెలిపినారు.మండలంలోని అన్ని గ్రామాలు ప్రజలు భయన్దోళనతో ఇంటినుండి బయటకు రావాలంటే భయపడుతున్నారు.నిన్నటివరకు కరోనావ్యాది గూర్చి అంతగా భయపడలేదు,ఎప్పుడైతే వైద్యశాల సిబ్బంది లో ఒకరికి పాజిటివ్ వచ్చిందని తెలిసిందో ప్రజలందరూ అప్రమత్తమై మాస్కులు దరిస్తున్నారు.మనిషికి మనిషికి దూరం పాటిస్తున్నారు.ప్రతిఒక్కరు శానిటీజర్ ను వాడుతున్నారు.ఈకార్యక్రమంలో వి ఆర్ పురం మండల ఎస్సై వెంకట్,ఏ ఎన్ యం లు,ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment