Followers

పరవాడ పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్థాలు 


పరవాడ పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్థాలు 

డంపింగ్.

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న స్థానికులు.

గాజువాక క్రైమ్ పోలీసుల పేరుతో రాయబేరాలు.

 

పరవాడ పెన్ పవర్

 

పరవాడ : గ్రామ రెవెన్యూ కార్యాలయం సమీపంలో జాతీయ రహదారి పక్కన సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో పారిశ్రామిక వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా నిబంధనలకు విరుద్ధంగా గుర్తుతెలియని వ్యక్తులు ఏపి 31 టి.ఎఫ్ నెంబరు గల వాహనంతో డంపింగ్ చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు రెడ్ హ్యాండెడ్  గా వ్యర్థాలను డంపింగ్ చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు.స్థానిక పోలీసులతో పాటు విలేఖర్లకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాన్ని స్టేషన్ కి తరలించారు. ఇదిలా ఉంటే వాహన యజమాని గాజువాక క్రైమ్ పోలీసుల పేరుతో రాయ బేరాలకు దిగడం కొసమెరుపు. పరవాడ పరిసర ప్రాంతంలో ఇటీవల ఫార్మా వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ డంపింగ్ చేస్తూ పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న విషయం తెలిసిందే.ఈ వ్యర్థాలకు నిప్పు పెట్టడం వలన పరవాడ గ్రామ ప్రజలు, సమీపంలో ఉన్న కాలనీవాసులు, వ్యర్థ పదార్థాల నుండి వచ్చే విషవాయువు పీల్చ లేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అంతే కాకుండా తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా పారిశ్రామిక వ్యర్థాలను డంపింగ్ చేయడంతో పరిసరాలను కలుషితం అవుతున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ డంపింగ్ చేయడం, వాటికి నిప్పు పెట్టడం చట్టరీత్యా నేరం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...