Followers

 బాధిత మైనర్ బాలికను ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం


 బాధిత మైనర్ బాలికను ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం/

 రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా....

 

 

 రాజమహేంద్రవరం ,పెన్ పవర్

 

 

 

 కోరుకొండ మండలం మధురపూడి గ్రామ బలహీన వర్గానికి చెందిన మైనర్ బాలిక ఇటీవల అత్యాచారానికి గురై రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న ఆమెను మంగళవారం నాడు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ మరియు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా ఎస్సీ కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ తో కలిసి పరామర్శించి బాధితురాలు కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

 ఈ సందర్భంగా శ్రీ రాజా మీడియాతో మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దిశ వంటి చట్టాలు రూపొందించి దోషులకు వెంటనే శిక్ష పడే విధంగా అనేక అడుగులు ముందుకు వేస్తున్న తరుణంలో కూడా ఇటువంటి ఈ సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని దోషులకు కఠిన శిక్ష పడే విధంగా ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశించామన్నారు. 13 మందిని అరెస్టు చేయడం జరిగిందని, వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు అని మరొక వ్యక్తి    పరారీలో ఉన్నాడని  తెలిపారు. వారిపై ఎస్సీ ఎస్టీ చట్టం, కిడ్నాప్, రేప్ కేసులు ఉంటాయన్నారు. రాబోయే రోజుల్లో రాజానగరం నియోజకవర్గంలో ప్రచార సాధనాల ద్వారా మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ మహిళల పట్ల దారుణాలకు పాల్పడితే ఎటువంటి శిక్షలు ఉంటాయో వాలంటీర్ల ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది అన్నారు.

 

 ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి  అమ్మాజీ మాట్లాడుతూ జరిగిన సంఘటన పూర్తి వివరాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వారికి విన్నవించి బాధితురాలికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిల సమన్వయ అధికారి డాక్టర్ రమేష్ కిషోర్, మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, స్థానిక నాయకులు కొల్లి వెలసి హారిక, ట్రేడ్ యూనియన్ నాయకులు వాసంశెట్టి గంగాధర్, తదితరులు చైర్మన్ రాజాతో ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...