అక్రమ గంజాయి గుట్టు రట్టు
గంజాయి విలువ 90 లక్షలు : డిఎస్పీ వెల్లడి
జగ్గంపేట, పెన్ పవర్
జగ్గంపేట పోలీసు స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దాపురం డిఎస్పీ శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. తమిళనాడు కు చెందిన పైడప్ప అనే వ్యక్తి విశాఖ జిల్లా బి బి పట్నం కు చెందిన మామిడి అప్పారావు దగ్గర 600 కేజీల గంజాయి ని 16లక్షల రూపాయల కు కొనుగోలు చేసినట్లు డిఎస్పీ చెప్పారు. గంజాయి ని ట్రాన్స్పోర్ట్ చేసేందుకే వ్యాన్ ను కొనుగోలు చేసి ప్రత్యేకంగా బాక్సు తయారు చేయించాడన్నారు. ఆ బాక్సులో 21 బస్తాలు గంజాయిని తీసుకువెడుతుండగా మాకు వచ్చిన సమాచారం మేరకు జాతీయ రహదారిపై హర్యానా డాబా దగ్గర ఆగి ఉన్న వ్యాన్ ను తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఆ వ్యాన్ లో గంజాయి ఉండటంతో ట్రాన్స్పోర్ట్ చేస్తున్న అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద 6 వేలు రూపాయల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. 21 బస్తాలు గంజాయి విలువ సుమారు 90 లక్షల రూపాయలు ఉంటుందని డిఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సిఐ సురేష్ బాబు, జగ్గంపేట, కిర్లంపూడి ఎస్ ఐ. లు టి.రామకృష్ణ, అప్పలరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment