Followers

రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య





తాళ్లపూడి  మండలంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. 


 


 


పెన్ పవర్ తాళ్లపూడి


 

 

 

 

తాళ్లపూడి  మండలంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకూ 9 కేసులు ఉండగా మూడు కేసులు పెరిగాయి. తాజాగా బుధవారం తాళ్లపూడి లో మరో రెండు కేసులు పెరిగాయి. వీటితో కేసుల సంఖ్య 14 కు పెరిగింది. మలకపల్లి లో వాలంటరీగా పనిచేస్తున్న యువకునికి కరోనా పాజిటివ్ గా గుర్తించారు. పెద్దేవం గ్రామానికి చెందిన ఒక యువకునికి కరోనా పాజిటివ్ గా గుర్తించడం జరిగింది. తాళ్లపూడిలో తాజాగా వచ్చిన రెండు కేసులు వ్యాపార వర్గానికి చెందినవి. అధికారులు ఎంతగా హెచ్చరించినప్పటికీ మార్కెట్లో ఎవరికీ జాగ్రత్తలు పట్టని పరిస్థితులు  ఈ సంఘటనతో అద్దంపడుతుంది. 

తగిన జాగ్రత్తలు పాటించకుండా ప్రజలు బయట తిరిగితే మరిన్ని కేసులు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. ఇరువురు పాజిటివ్ వ్యక్తులను ఐసోలేషన్ కి తరలించారు.  ఎస్.ఐ జి.సతీష్ ప్రైమరీ కాంట్రాక్ట్ లను గుర్తించారు. తహసిల్దార్ ఎం. నరసింహ మూర్తి ఆధ్వర్యంలో రెడ్ జోన్ ఏర్పాటు చేయగా, కార్యదర్శి వీరన్న ఆధ్వర్యంలో శానిటేషన్ పనులు జరుగుతున్నాయి.


 

 




No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...