కరోనా బారిన పడి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలి
జగ్గంపేట, పెన్ పవర్
కరోనా బారిన పడి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని, కోవిడ్ వారియర్స్ గా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గండేపల్లి జర్నలిస్టులు తహసిల్దార్ చిన్నారావు కు వినతి పత్రం అందజేశారు.
విధినిర్వహణలో అనేక మంది జర్నలిస్టులు కోవిడ్ భారిన పడుతున్న నేపథ్యంలో వారిని కోవిడ్ వారియర్స్ గా గుర్తించాలని ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జిల్లాలోని నియోజకవర్గాల్లో ఆయా అధికారులకు వినతిపత్రాలు అందించాలని జిల్లా ఏపీయూడబ్ల్యూజే ఇచ్చిన పిలుపుమేరకు గండేపల్లి లో తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ చిన్నారావు మాట్లాడుతూ ఈ విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెడతానన్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి వెలిది వెంకటరత్నం మాట్లాడుతూ కరోనా బారిన పడిన జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే నాయకులు పెను గాడి సూరిబాబు మాట్లాడుతూ కరోనా బారిన పడి రాష్ట్రంలో ఇప్పటికే ఆరుగురు మృతి చెందారని, వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. జిల్లా మెంబెర్ యూనియన్ అడపా శ్రీనివాస్ మాట్లాడుతూ విధినిర్వహణలో అనేక మంది జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారన్నారు. రాజమహేంద్రవరం రూరల్ టీవీ5 రిపోర్టర్ రాము కరోనా వచ్చి చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. కరోనా తో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని ఏపీయూడబ్ల్యూజే తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు కొత్త గళ్ళ శ్రీనివాస్, చింతపల్లి శివ, లంజ పల్లి శ్రీను పాల్గొన్నారు.
No comments:
Post a Comment