Followers

బి.జె.పి.సిటీ కార్యాలయంలో  నిరసన







బి.జె.పి.సిటీ కార్యాలయంలో  నిరసన.

 

పూర్ణా మార్కెట్, పెన్ పవర్

 

 

భారత ప్రధాని నరేంద్ర మోడీ  ఆశయాల మేరకు ప్రతి పేదవానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్షల సంఖ్యలో ఇళ్లను కేటాయించడం జరిగింది కానీ, ఈ పథకం ద్వారా టి.డి.పి. ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల కాంట్రాక్టుల్లో అవినీతి చోటుచేసుకుందని కారణం చూపుతూ, ప్రస్తుతం మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదివరకే నిర్మించిన ఇళ్లను పేదలకు కేటాయించకుండా వాటిని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ  బుధవారం ఉదయం లాసన్స్ బే కాలనీ లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు  ఏం.రవీంద్ర అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, విశాఖపట్నం మాజీ ఎం.పి. డా.కంభంపాటి హరిబాబు విచ్చేసారు.

 

ఈ సందర్భంగా డా.కంభంపాటి హరిబాబు గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2022 వ సంవత్సరానికల్లా ప్రతి కుటుంబానికి స్వంత ఇల్లు ఉండాలనే సంకల్పంతో కోటి ఐదు లక్షల ఇళ్లను దేశవ్యాప్తంగా మంజూరు చేయగా, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఇరవై లక్షలకు పైగా ఇళ్లను కేటాయించారు అని తెలిపారు. మన రాష్ట్రంలో గత ప్రభుత్వం తప్పుచేస్తే దోషులను శిక్షించాలి కానీ పేదలకు అన్యాయం చేయకూడదు అని అన్నారు.

 

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఏం.రవీంద్ర మాట్లాడుతూ దేశంలో అనేక పెద్ద రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే 20 శాతం ఇళ్లను కేటాయించడం అనేది ఎంతో గొప్ప విషయం అని అన్నారు. ప్రతి ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష యాభై వేల రూపాయలను సబ్సిడీ రూపంలో అందించినా కూడా అప్పట్లో అధికారంలో ఉన్న టి.డి.పి. ప్రభుత్వం సజావుగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టలేకపోయిందని మరియు విపరీతమైన అవినీతికి పాల్పడిందని తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న వై సీ పీ ప్రభుత్వం ఇదివరకే నిర్మించిన ఇళ్లను పేదలకు కేటాయించకుండా తాత్సారం చేస్తుందని ఆయొక్కగృహాలు టి.డి.పి. ప్రభుత్వం యొక్క స్వంత నిధులతో నిర్మించలేదని గ్రహించి, తక్షణమే అర్హులకు నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను అందించాలని డిమాండ్ చేసారు.

 

ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా నగర అధ్యక్షులు చిరికి.సత్యనారాయణ, తురగ, శ్రీరామ్,ప్రసాద్ గారు తదితరులు సామజిక దూరం పాటిస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలియజేసారు. 


 

 




 

 



 



 



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...