రాష్ట్ర ప్రభుత్వాల అవినీతిపై భాజపా నిరసన
అనకాపల్లి, పెన్ పవర్
ప్రతి పేదవాడికి సొంత ఇంటిని కల్పించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని భాజపా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ , వైకాపా పార్టీ లు ఒకరికొకరు పోటీగా అవినీతి చేస్తూ పేదవాడిని అణగ తొక్కుతున్నారనారు. ఇటుక ఇటుక లో చంద్రన్న అవినీతి అడుగు అడుగు లో వైకాపా అరాచకం నినాదంతో రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరేళ్ళ కాలంలో మోడీ ప్రభుత్వం 11 లక్షల ఇళ్లు ఏపీకి కేటాయించినట్లు వెల్లడించారు. ప్రతి లబ్దిదారునికి కేంద్రం వాటా 1.5 లక్షలను కేటాయిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో మూడు లక్షల పదివేలు గృహాలకు సంబంధించి రు .4, 600 కోట్లు కేంద్రం పూర్తిగా చెల్లించినట్లు గుర్తుచేశారు. చంద్రబాబు పాలనలో ఇల్లు ఎవరికి కేటాయించకపోవడం, జగన్ పాలనలో స్థల కొనుగోలు లోనే భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపించారు. చంద్రబాబు జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ఆర్ఇజిఎస్ నిధులను కూడా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం కేటాయించినా నిధులను దుర్వినియోగం తప్ప పనులకు ఉపయోగించడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డి. పరమేశ్వర రావు, పట్టణ కార్యదర్శి కర్రీ రామకృష్ణ, మండల అధ్యక్షులు కసిరెడ్డి శ్రీను, మాజీ ఎంపిటిసి చదరం నాగేశ్వరరావు, మజ్దూర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి అలమండ శ్రీను , మీడియా సెల్ కన్వీనర్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ మద్దతు పలికింది.
No comments:
Post a Comment