కారు బోల్తాపడలేదు..
అది ఎన్‌కౌంటరూ కాదు..
యోగి సర్కార్‌పై ప్రశ్నల తూటా
దూబే ద్వారా రహస్యాలు బయటపడితే ప్రభుత్వం బోల్తా
అందుకే ఈ చర్యలు తీసుకున్నారు: అఖిలేశ్
దూబేకు సహకరించిన వారి సంగతేంటి?: ప్రియాంకా గాంధీ
చనిపోయిన వ్యక్తి ఎలాంటి కథలు చెప్పలేడు కదా: ఒమర్ అబ్దుల్లా
గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే భయపడిందే జరిగింది. ప్రాణభయంతో స్వయంగా పోలీసులకు పట్టుబడిన వికాస్ దుబే.. చివరికి తన చావును తానే కొనితెచ్చుకున్నట్టయింది. పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతూ వికాస్ దుబే హతమయ్యాడన్న వార్త విని కాన్పూర్ వాసులు పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల వికాస్‌దుబే చేతిలో చనిపోయిన పోలీసు కుటుంబాలు.. తమకు అసలైన న్యాయం ఇప్పుడే జరిగిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు ఇదే సమయంలో వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై విమర్శలు కూడా మొదలయ్యాయి. వికాస్ దుబేది ఫేక్ ఎన్‌కౌంటర్ అంటూ.. విపక్షాలు యోగి సర్కార్‌ను టార్గెట్ చేశాయి. వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడుఅఖిలేష్ యాదవ్.. వికాస్ దుబే పేరు ప్రస్తావించకుండా యూపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కారు బోల్తాపడలేదు కానీ.. కాని రహస్యాలు బయటకు రాకుండా జాగ్రత్తపడి.. ప్రభుత్వం బోల్తాపడకుండా చూసుకోగలిగింది అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. క్రిమినల్‌ని చంపారు సరే..ఇన్నాళ్లు అతని నేరాలకు సహకరించినవారు, కాపాడిన వారి సంగతేంటని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా ట్విట్టర్ వేదికగా యూపీ సర్కార్‌ను ప్రశ్నించారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దులా .. వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై పోలీసులు చేసిన ప్రకటనపై సెటైర్ వేశారు. మరణించినవారు కథలు చెప్పలేరు అంటూ ఆయన కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే ఇటీవలే యూపీలో జరిగేవన్నీ ఫేక్ ఎన్‌కౌంటర్లేనని.. వాటిపై విచారణ జరిపించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ క్రమంలోనే వికాస్‌దుబే ఎన్‌కౌంటర్ కూడా జరగడం చర్చనీయాంశంగా మారింది.
No comments:
Post a Comment