రెవెన్యూ సచివాలయ సిబ్బందికి మాస్క్ లు శానిటైజర్లు పంపిణీ చేసిన
జనసేన మోటూరు
పరవాడ పెన్ పవర్
పరవాడ మండలం: రావాడ గ్రామ పంచాయతీ లో గల సచివాలయం లో పనిచేస్తున సెక్రటరీ,వీఆర్వో, సచివాలయం సిబ్బంది 26 మంది కి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెందుర్తి నియోజవర్గ జనసేన నాయకులు మోటూరు సన్యాసినాయుడు ఆర్థిక సాయం తో కేఎన్ 95 మాస్కులు అలాగే శానిటైజర్ లు ఒక్కొక్కరికి రెండేసి చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే మోటూరు హరి బాబు ఆర్థిక సాయం తో పారిశుద్ధ్య కార్మికులకు 25 కేజీలు బియ్యం,పది రకాల కిరాణా, ఏడు రకాల కాయగూరలు,ఒక జత బట్టలు ఇచ్చి సన్మానం చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో రావాడ గ్రామ పంచాయతీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
No comments:
Post a Comment